స్పాట్‍లైట్ 101
ప్రేరణ పొందండి మరియు మీ సృజనాత్మకతను షేర్ చేయండి.
స్పాట్‍లైట్ అంటే ఏమిటి?
స్పాట్‍లైట్ అనేది యూజర్-ఉత్పత్తి చేసే కంటెంట్‍కు మా వినోద ప్లాట్‍ఫారం. ఇది సృష్టికర్తలు విస్తృత శ్రేణిలోని Snapchat కమ్యూనిటీకి వెల్లడి అయ్యేందుకు ఉత్తమ మార్గం. స్పాట్‍లైట్ మీరు కలిగివున్న ఫాలోవర్ల సంఖ్యతో సంబంధంలేకుండా, మీ వంటి సృజనాత్మక వ్యక్తులనుండి నాణ్యమైన కంటెంట్‍ను హైలైట్ చేస్తుంది.
స్పాట్‍లైట్ మీ కెమెరా రోల్ నుండి వీడియోలకు మద్దతిస్తుంది, కాని Snapchat కెమెరా ఉపయోగించి సృష్టించిన Snapలను హైలైట్ చేస్తుంది.
వీడియోలను సృష్టించండి, తరువాత వాటిని క్రింది టూల్స్ ఉపయోగించి ఎడిట్ చేయండి.
  • క్యాప్షన్లు
  • లైసెన్స్ పొందిన సంగీతం
  • వాస్తవ ధ్వని రికార్డింగులు
  • లెన్సులు
  • GIFs
Snap, స్పాట్‍లైట్ Snapsలో పైస్థానాలలీ ఉండే సృష్టికర్తలకు ప్రతినెలా మిలియన్ల నగదును అందుబాటులో ఉంచుతుంది, కాబట్టి సృజనాత్మకంగా మారండి, బహుమతులు గెలుపొందండి!
దాఖలుకు ఉత్తమ విధానాలు
  • Snaps 60 సెకండ్ల వరకు పొడవు, ధ్వనితో నిలువుగా ఉండాలి
  • వీడియో పూర్తి ఫ్రేమ్‍తో ఉండాలి (లెటర్ బాక్సింగ్ ఉండరాదు)
  • స్టిల్-ఇమేజ్ ఫోటోలు మరియు క్షితిజ సమాంతర, అస్పష్టమైన లేదా వచన-మాత్రమే Snapలు స్పాట్‌లైట్‌లో చూపబడవు
  • అసలైన కంటెంట్‍ను అప్‍లోడ్ చేయండి-ఇతర యాప్స్ నుండి తీసుకొన్న వాటర్‍మార్క్ చేయబడిన వీడియోలు స్పాట్‍లైట్‍ నుండి ఫిల్టర్ చేయబడతాయి
మీ Snapలకు #అంశాలను జోడించండి
#అంశాలు ఇతర Snapchatలు మీ కంటెంట్ కనుగొని, షేర్ చేసుకోవడానికి మరియు మీ వంటి మరెన్నో ఇతర Snapలను అన్వేషించేందుకు దోహదం చేస్తాయి. మీరు స్పాట్‍లైట్ వీడియో క్రింద ఎడమవైపు #అంశాలపై టాప్ చేస్తే, ఉపయోగించే అన్ని వీడియోలు చూడగలుగుతారు.
మీ వీడియోకు #అంశాలను జోడించేందుకు, మొదట మీ Snapను రికార్డ్ చేయండి, ఆ తరువాత 'షేర్ టు స్పాట్‍లైట్' ను టాప్ చేసి, వివరణ జోడించండి లేదా # అంశాన్ని ’సెండ్ టు' స్క్రీన్‍కు పంపండి. ఒక హ్యాష్‍ట్యాగ్ ఉపయోగించడంవల్ల, మీరు టైప్ చేస్తున్నప్పుడు ప్రస్తుతమున్న #అంశాలు కనపడటం లేదా మీ స్వంత దాన్ని మీరు తయారు చేసుకోవచ్చు.
 
ఏది ట్రేండింగ్ లో ఉందో చూడండి
స్పాట్‍లైట్‍పై ఇటీవలి ట్రెండ్స్ లో ఇన్‍సైట్స్ పొందండి. ట్రేండింగ్ లో ఉన్న #అంశాలు, లెన్సులు, మరియు ధ్వనులను చూసేందుకు స్పాట్‍లైట్ స్క్రీన్‍ కుడి పైభాగాన ఉన్న పైకి చూపే బాణం ఐకాన్‍ను టాప్ చేయండి.