ఇక ప్రారంభిద్దాం!
ఒక ప్రో లాగా Snap గురించి మీరు తెలుసుకోవాల్సిన ప్రతీదీ మా వద్ద ఉంది.

ఒక Snapchat అకౌంట్ సృష్టించండి
Snapchat యాప్ డౌన్‌లోడ్ చేయడం ఎలాగో తెలుసుకోండి మరియు ఒక Snapchat యూజర్‌నేమ్ సృష్టించండి. మీరు అకౌంట్ సృష్టించిన తర్వాత, Snapchat యొక్క కీలక భాగాల గురించి తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.
మీ అకౌంట్ భద్రత మాకు ముఖ్యం. Snapchat పైన ఎలా ఎలా సురక్షితంగా ఉండాలి మరియు రెండు-అంశాల అధీకరణనుఎలా సక్రియం చేయాలి అనే దాని కోసం ఈ చిట్కాలనుసమీక్షించండి.
మీ పబ్లిక్ ప్రొఫైల్ నిర్మించుకోండి
ఒక పబ్లిక్ ప్రొఫైల్ అనేది Snapchat పైన మీకు శాశ్వత స్థావరాన్ని ఇస్తుంది, అక్కడ మీరు పబ్లిక్‌గా కనుగొనబడవచ్చు, మీ సృజనాత్మకతను ప్రదర్శించవచ్చు, మరియు మీ ఆడియన్స్ ని పెంచుకోవచ్చు.
మీ పబ్లిక్ ప్రొఫైల్ ని ప్రాప్యత చేసుకోవడానికి, కేవలం స్క్రీన్ టాప్ ఎడమ మూలలో ఉన్న మీ Bitmoji ని ట్యాప్ చేయండి, “నా పబ్లిక్ ప్రొఫైల్” ఎంపిక చేయండి. ప్రొఫైల్ ఫోటో, బ్యాక్‌గ్రౌండ్ ఫోటో, బయో మరియు లొకేషన్ ని చేర్చేలా చూసుకోండి.
మీ అభిమానులు మిమ్మల్ని కనుగొనడంలో సహాయపడటానికి మీ ఇతర సామాజిక ఛానెల్స్ కు మీ Snapchat అకౌంట్ యూజర్‌నేమ్ మరియు/లేదా URL ని జోడించడం మర్చిపోవద్దు.

మీరు పోస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు!
ఒక ఫ్రెండ్ అయినా, ఎంపిక చేసిన ఒక గ్రూప్ అయినా, లేదా వెడల్పైన Snapchat కమ్యూనిటీ అయినా, Snapchatపై మీ కంటెంట్ పంచుకోవడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. Snapchat పై పంచుకోబడిన కంటెంట్ అంతయునూ, Snapchat యొక్క కమ్యూనిటీ మార్గదర్శకాలు మరియు కంటెంట్ మార్గదర్శకాలకుకట్టుబడి ఉండాలి.

నా స్టోరీ · ఫ్రెండ్స్
మీ నా స్టోరీ . ఫ్రెండ్స్ కి పోస్ట్ చేసిన Snaps మీరు ఫ్రెండ్స్ గా ఉన్న Snapchatters కు (మీరు తిరిగి జోడించిన వ్యక్తులు) మాత్రమే కనిపిస్తాయి. మీ మిత్రులు మీ స్టోరీ ని 24 గంటల పాటు అపరిమిత సంఖ్యలో చూడవచ్చు. మీ స్టోరీకి పోస్ట్ చేయడంఎలాగో అనేదాని గురించి మరింతగా తెలుసుకోండి.

నా స్టోరీ · పబ్లిక్
మీ పబ్లిక్ నా స్టోరీ అనేది మీరు మిమ్మల్ని అనుసరించేవారికి మరియు వెడల్పైన Snapchat కమ్యూనిటీతో కంటెంట్‌ను ఎలా పంచుకోవచ్చు అనేది. మీ నా స్టోరీ · పబ్లిక్ కి పోస్ట్ చేయబడిన స్టోరీలను మీ అనుచరులు స్టోరీస్ పేజీ యొక్క 'ఫాలోయింగ్' విభాగములో చూస్తారు. మీ ప్రొఫైల్ ని చూస్తున్న ఎవరైనా సరే మీ క్రియాశీలక పబ్లిక్ స్టోరీస్ కూడా చూడవచ్చు.
ఒకవేళ మీరు Snap పైన విస్తృత ఆడియన్స్ ని ఏర్పరచుకున్న సృష్టికర్త అయి ఉంటే, మీ పబ్లిక్ స్టోరీస్ Discover లోని కమ్యూనిటీకి సిఫార్సు చేయబడవచ్చు.
మీ పబ్లిక్ నా స్టోరీ ని 'సెండ్ టు' స్క్రీన్ లో నా స్టోరీ · పబ్లిక్ శీర్షికన ఒక పోస్టింగ్ ఆప్షన్ గా కనుగొనవచ్చు.
స్పాట్‌లైట్
విశాలమైన Snapchat కమ్యూనిటీకి బహిర్గతం కావడానికి సృష్టికర్తలకు స్పాట్‌లైట్ అనేది ఒక గొప్ప మార్గం.
ఇది అత్యంత వినోదాత్మక Snaps ని ప్రదర్శిస్తుంది, వాటిని ఎవరు సృష్టించినా లేదా మీకు ఎంత మంది అనుచరులు ఉన్నా సరే పరవాలేదు.
ఒక స్పాట్‌లైట్ సమర్పించడంఎలాగో మరింతగా తెలుసుకోండి.
మీరు వెబ్ పైన స్పాట్‌లైట్ కంటెంట్ కూడా చూడవచ్చు మరియు అప్‌లోడ్ చేయవచ్చు! దానిని చూడడానికై www.snapchat.com/spotlight కు వెళ్ళండి.
Snap మ్యాప్
కేవలం మీ కోసం, మీ ఫ్రెండ్స్, మరియు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషించడం కోసం మాత్రమే నిర్మించబడిన ఒక మ్యాప్. ఒక సృష్టికర్త గా మీరు మీ Snaps మరియు స్పాట్‌లైట్ వీడియోలలో స్థానాలను ట్యాగ్ చేయడం ద్వారా మీ చేరువను విస్తరించుకోవచ్చు. Snap మ్యాప్‌ను తెరవడానికి కెమెరా స్క్రీన్ నుండి రెండుసార్లు కుడి వైపు స్వైప్ చేయండి.
మీకు ఒక పబ్లిక్ ప్రొఫైల్ ఉంటే, మీరు Snap మ్యాప్‌కు అజ్ఞాతంగా లేదా మీ పేరును జోడించి Snaps సమర్పించడానికి ఎంచుకోవచ్చు. Snap మ్యాప్ కి సమర్పించడంఎలాగో మరింతగా తెలుసుకోండి.

ఒక Snap స్టార్ అవండి
Snap స్టార్స్ అనేవారు ప్రజా ప్రముఖులు లేదా Snapchat కి కొంత అత్యుత్తమమైన మరియు అత్యంత వినోదాత్మకమైన కంటెంట్‌ను తీసుకువచ్చే సృష్టికర్తలు. తమ విశిష్టమైన దృక్కోణాల ద్వారా, Snap స్టార్స్ వారి ప్రేక్షకులకు వారి జీవితం మరియు ఆసక్తుల లోనికి అపూర్వమైన ప్రాప్యతను అందిస్తారు.
Snap స్టార్స్ తమ కంటెంట్‌ను Snapchat లో ప్రదర్శించడానికి అర్హులుగా ఉంటారు. ఒక Snap స్టార్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలాగో మరింతగా తెలుసుకోండి.