Snapchat పై డబ్బు ఎలా సంపాదించాలో తెలుసుకోండి

Snapchat రాబడి వాటా కార్యక్రమం
మీరు Snapchat పైన నిరంతరంగా స్టోరీస్ పంచుకుంటున్న సృష్టికర్త అయి ఉన్నారా? అలా అయితే, మా కార్యక్రమం, స్థాపించబడిన సృష్టికర్తలకు వారి స్టోరీ కి పోస్ట్ చేసే కంటెంట్ కోసం బహుమతిని ఇస్తుంది - ఇది Snapchat కమ్యూనిటీలో గడిపినందుకు ధన్యవాదాలు చెప్పే మా మార్గంగా ఉంది. ఎలా అర్హత పొందాలో మరియు మా Snapchat సృష్టికర్త స్టోరీస్ నిబంధనలుగురించి మరింత తెలుసుకోండి.

పెయిడ్ పార్ట్‌నర్‌షిప్ లేబుల్
మీరు ప్రాయోజిత కంటెంట్‌ను పోస్ట్ చేయాలనుకుంటే, పంపించే స్క్రీన్ నుండి మీ పబ్లిక్ Snaps పైన " పెయిడ్ పార్ట్‌నర్‌షిప్" లేబుల్‌ని జోడించవచ్చు.
Snap స్టార్స్ ఒక అడుగు ముందుకు వెళ్ళి, తమ స్వంత స్పాట్‌లైట్, Snap మ్యాప్, మరియు పబ్లిక్ స్టోరీలు పోస్ట్ చేసేటప్పుడు ఒక బ్రాండ్‌ను ట్యాగ్ చేయవచ్చు. మీ ప్రాయోజిత కంటెంట్‌పై " పెయిడ్ పార్ట్‌నర్‌షిప్" లేబుల్ ఎలా జోడించాలో ఇక్కడ ఉంది.

బ్రాండ్ పార్ట్‌నర్‌షిప్స్ టాగుల్
Snapchat పైన సృష్టికర్తలను కనుగొనటానికి వ్యాపారాలు తరచుగా తృతీయ పక్ష భాగస్వాములను ఉపయోగిస్తున్నారు. 'బ్రాండ్ పార్ట్‌నర్‌షిప్స్ టాగుల్' ద్వారా Snap యొక్క తృతీయ పక్ష భాగస్వాములతో మీ పబ్లిక్ ప్రొఫైల్ విశ్లేషణలను పంచుకోవడానికి ఎంచుకోండి - వ్యాపారాలు తమ బ్రాండ్ తో పని చేయడానికి ఏ సృష్టికర్త ఉత్తమమో నిర్ణయించుకోవడానికి ఈ సమాచారం కీలకం అవుతుంది.
మీ పబ్లిక్ ప్రొఫైల్ సెట్టింగ్లు వీక్షించండి మరియు 'బ్రాండ్ పార్ట్‌నర్‌షిప్స్’ కోసం సృష్టికర్త ఆవిష్కరణపై దృష్టి సారించే తృతీయ పక్ష భాగస్వాములతో మీ గ్రాహ్యతలను బహిరంగంగా పంచుకునేలా ఎంచుకోవడానికి బ్రాండ్ పార్ట్‌నర్‌షిప్స్ పై టాగుల్ చేయండి.
ఈ సమయంలో ఇది Snap స్టార్స్ కి మాత్రమే అందుబాటులో ఉంటుందని దయచేసి గమనించండి.