స్పాట్‍లైట్‍పై బహుమతి పొందడమెలా

అప్‌డేట్ చేయబడింది: జనవరి 2024

చిన్న వీడియోలు సృష్టించేందుకు మరియు వాటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్లకొద్దీ వినియోగదారులతో పంచుకొనేందుకు స్పాట్‌లైట్ మీకు అవకాశం కల్పిస్తుంది. మేము మా కమ్యూనిటీ యొక్క సృజనాత్మకమైన రచనలను గుర్తిస్తాము మరియు స్పాట్‍లైట్ అనేది ఎవరైనా ఒక ప్రముఖ స్థానం పొందగలిగే ఒక ప్రదేశం.

ఉద్భవిస్తున్న సృష్టికర్తలకు విజయాన్ని అందజేయడం

Snapఛాటర్లకు వారి సృజనాత్మకతకు బహుమతి ఇవ్వడం మాకు ఎంతో ముఖ్యం. స్పాట్‌లైట్ సృష్టికర్తలకు అందుబాటులో ఉన్న మొత్తం రివార్డులు పెంచబడ్డాయి అనే విషయం మేము మీతో ఉత్సుకతతో పంచుకొంటున్నాము.

స్పాట్‌లైట్ సృష్టించడంలో పెట్టుబడి పెడుతున్న ఉద్భవ సృష్టికర్తలకు మేము బహుమతి ఇస్తున్నాము. అర్హులైన Snapచాటర్లు నెలవారీ బహుమతులు - ఆ క్యాలెండర్ నెలలో అత్యుత్తమ సృష్టికర్తలయితే- వాటిని నగదుకు మార్చుకొనేలా, అవకాశం పొందవచ్చు. పనితీరు అనేది వీక్షణలు మరియు ఆకట్టుకొనే ఇతర అంశాలు వంటి వివిధ మెట్రిక్స్ ఆధారంగా రూపొందించబడిన ఒక ప్రొప్రైటరీ ఫార్ములాచే నిర్ణయించబడుతుంది/

అర్హులు కావడానికి:

  1. మీ అకౌంట్ వయస్సు కనీసం 1 నెల ఉండాలి

  2. మీ ప్రొఫైల్ బహిరంగంగా సెట్ చేయబడాలి

  3. మీరు కనీసం 1,000 మంది ఫాలోయర్లను కలిగి ఉండాలి

  4. మీరు ఆ మీరు ఆ క్యాలెండర్ నెలలో కనీసం 10,000 వీక్షణలను ఖచ్చితంగా పొందివుండాలి

  5. మీరు ఆ క్యాలెండర్ నెలలోని 5 వేర్వేరు రోజులలో కనీసం 10 సార్లు పోస్ట్ చేసివుండాలి. కనీసం 5 పోస్ట్‌లు Snapchat క్రియేటివ్ టూల్ (కెమెరా, ఎడిటింగ్, లేదా సంగీతం లలో ఏదైనా ఒకటి)

  6. మీ కంటెంట్ అసలైనదై ఉండాలి (మీచే సృష్టించబడాలి)

  7. మీరు అర్హమైన దేశంలో నివసిస్తుండాలి మరియు Snapలను అక్కడి నుండే పోస్ట్ చేయాలి

  8. మీరు విజయవంతంగా ఒక చెల్లింపు అక్కౌంటునుసెటప్ చేసుకొని ఉండాలి

  9. మీరు కమ్యూనిటీ మార్గదర్శకాలు, కంటెంట్ మార్గదర్శకాలు, స్పాట్‌లైట్ మార్గదర్శకాలు, సేవా నిబంధనలు, సంగీతం మార్గదర్శకాలు, మరియు మా స్పాట్‌లైట్ నిబంధనలను పాటించాలి. స్పాట్‍లైట్ నుండి తొలగించబడిన ఏవైనా Snaps చెల్లింపుకు అర్హం కావు.

మీరు స్పాట్‌లైట్ సమర్పణల నుండి బహుమతులను పొందడానికి అర్హులైనట్లయితే, మీరు Snapచాట్ యాప్‌లో ఒక పుష్ నోటిఫికేషన్ అందుకుంటారు మరియు ఇది మై ప్రొఫైల్ పై కూడా నోటిఫై చేయబడుతుంది, మీరు క్రిస్టల్స్ హబ్‌ను తెరవడానికి 'మై Snap క్రిస్టల్స్' ని ట్యాప్ చేయవచ్చు.

మీ స్పాట్‍లైట్లను ఎవరు చూస్తారు?

మేము ప్రతి వ్యక్తి యొక్క అనుభవాన్ని స్పాట్‍లైట్‍లో వారికి మరింత స్వంతంగా అనిపించేలా చేస్తాము. మా కంటెంట్ ఆల్గరిథమ్స్ ప్రతి స్నాప్‍చాటర్ ఆసక్తి కనపరచేలా ఆకట్టుకొనే Snapsను ఉంచేందుకు ప్రయత్నిస్తాయి.

మేము సేవలో నిర్మించే ప్రతిదీ, స్నాప్‍చాటర్లు తమను తాము వెల్లడి చేసేందుకు, ఆ క్షణాన్ని జీవనభరితం చేసుకొనేందుకు, ప్రపంచం గురించి మరింత తెలుసుకొనేందుకు మరియు అంతా కలిసి ఆనందాన్ని ఆస్వాదించేందుకు ఉద్దేశించబడింది.