మీ కంటెంట్ విధానాన్ని అభివృద్ధి చేసుకోండి

ముఖ్యమైన ఈ విధానాలు మీ కంటెంట్, మీ ఆడియన్స్ ను ఎంగేజ్ చేసేందుకు మరియు దాన్ని పెంచుకోవడానికి సహాయపడవచ్చు!

మీకులాగే ఉండండి

Snapchat అనేది మీ రోజులోని ఉత్తమమైన భాగం నుండి మధ్యలో ఉండే చిలిపి క్షణాల వరకు స్టోరీ మొత్తాన్ని మాకు చెప్పగలిగే ప్రదేశం. ఆడియన్స్ మీలోని అసలైన వ్యక్తిని చూడాలనుకొంటారు కాని, కేవలం కొద్దిగా పొగ మరియు అద్దాలు కాదు.

మీ స్టోరీ ఫీడ్‍ను ప్రమోషనల్ పోస్ట్ ల మధ్య రోజూవారీ జీవితం, అప్పుడు చేస్తున్న పనులను వివరిస్తూ, రెంటిమధ్యా సమతుల్యం ఉండేలా చూసుకోండి. మీరు దేని గురించి పట్టించుకొంటారు అనేదాన్ని తెలుసుకోవాలనుకొంటారు, అందువల్ల కంటెంట్‍ను ప్రమోట్ చేసేటప్పుడు వాస్తవానికి దగ్గరగా ఉండేలా చూసుకోండి.

ఉత్పత్తులను ప్రమోట్ చేసేటప్పుడు, మీ ఆడియన్స్ కు ప్రోత్సాహకంగా ఒక కూపన్ ఇవ్వండి మరియు ఒక సెల్ఫీ పోస్ట్ చేయడంవంటి వాటిని కోరండి.

ఫీడ్‍బాక్‍ను సహృదయంతో స్వీకరించండి

శక్తివంతమైన సంబంధాలు నిర్మించుకొనేందుకు అభిమానులతో కమ్యూనికేట్ చేయండి. వారితో కనెక్ట్ అవండి మరియు వారు ఏం చూడటానికి ఆసక్తి కనపరుస్తారో తెలుసుకోండి.

ఉదాహరణకు, మీరు మట్టిపాత్రలు తయారుచేస్తుండవచ్చు, కాని మీ అభిమానులు మీ వస్త్రాల గురించి అడగవచ్చు. దానిపై శ్రద్ధ పెట్టండి. ఈ మిశ్రమానికి కొత్తపోకడ జోడించండి.

నిరంతరం పోస్ట్ చేస్తుండండి

టన్నులకొద్దీ Snapchatterలు యాప్‍ను రోజూ ఉపయోగిస్తుంటారు! మీ ఆడియన్స్ లో ఉత్సుకతను పెంచండి మరియు మరిన్నింటి కోసం తిరిగి వచ్చేలా చేసుకోండి.

కేవలం ఫోటోలు మాత్రమే కాకుండా వీడియో-ఆధారిత స్టోరీలను చేయడం మంచిది. మీ కంటెంట్ వీక్షించడానికి ప్రజలు ఎక్కువ సమయం కేటాయిస్తారు. మీ కంటెంట్‍ను మరింత ఆకర్షణీయంగా చేసేందుకు Snap యొక్క క్రియేటివ్ కెమెరా మరియుఎడిటింగ్ టూల్స్ ఉపయోగించండి.

స్థానిక కంటెంటే ఉత్తమం

ఒక స్థానిక Snapchat కెమెరా ఉపయోగించి, Snapchatకు స్థానికమైన కంటెంట్‍ను సృష్టించండి. ఇది ఖచ్చితమైనదనీ, వ్యక్తిగతమైనదనీ, మరియు వేరే ఇతర వేదికలనుండి నకలు చేయబడింది కాదని నమ్మడానికి దోహదం చేస్తుంది.

సృష్టించేవారు ఎంతో కొనసాగింపును కలిగివుంటారు మరియు చాలా ఎక్కువ వేదికలపై పనిచేస్తుండవచ్చు. Snapchatపై మీ కంటెంట్, మీరు వేరొక వేదికపై పోస్ట్ చేసే కంటెంట్‍ను పోలివుంది అనిపించకుండా ఉండేలా చూసుకోండి. కంటెంట్ కేవలం మీకు మాత్రమే చెందినదై ఉండాలి. స్నీక్ పీక్ కంటెంట్ చాలా బాగా పనిచేస్తుంది. మీ ప్రొఫైల్‍ను సులభంగా కనుగొనేందుకు మీ Snap యూజర్ నేమ్‍ను ఇతర వేదికలపై షేర్ చేసుకోవడమనేది నిజంగా ఒక గొప్ప ఆలోచన.

ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతున్న వాటిపై దృష్టి పెట్టండి

ప్రేక్షకులలో మిమ్మల్మీ మీరు ఒక గుర్తింపుని పొందిన పేరుగా స్థిరపడేందుకు ప్రధానంగాపస్తుతం ప్రజల్లో ఉన్న విషయాల పై దృష్టి పెట్టండి.

ఇతర సృష్టికర్తలతో సమన్వయం చేసుకోండి

మరింత ఎక్కువమందికి చేరుకోవడానికి వీలుగా సృష్టికర్తలతో భాగస్వామ్యంలో చేరండి.