మీ కంటెంట్‍ను పంచుకోవడానికి మార్గాలు
ఒక ఫ్రెండైన, ఒక ఎంపిక చేసిన గ్రూప్, మీ అనుచరులు, లేదా విస్త్రృతమైన Snapchat కమ్యూనిటీ అయినా, Snapchatపై మీ కంటెంట్ పంచుకోవడానికి చాలా మార్గాలున్నాయి. Snapchatపై షేర్ చేయబడిన కంటెంట్ మొత్తం, ఖచ్చితంగా, Snapchat కమ్యూనిటీ మార్గదర్శకాలు మరియు కంటెంట్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి.
ఫ్రెండ్స్ కొరకు నా స్టోరీ
Snapchat 2013లో మొట్ట మొదటి సారిగా ప్రారంభించిన ఈ స్టోరీస్‍లో, మీరు మీ రోజూవారీ క్షణాలను మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవచ్చు. నా స్టోరీ కేవలం మీ సన్నిహితులైన ఫ్రెండ్స్‌కు మాత్రమే ఉద్దేశించబడింది (మిమ్మల్ని తిరిగి చేర్చుకున్నవారు). సెట్టింగ్లుకు వెళ్ళి, "గోప్యతా నియంత్రణలు" విభాగానికి స్క్రోల్ చేసి, "నా స్టోరీ వీక్షించండి"ని కేవలం "నా ఫ్రెండ్స్" అని లేదా "కస్టమ్" గా సెట్ చేసుకోండి. "కస్టమ్" అనేది కొంతమంది ఫ్రెండ్స్, మీ స్టోరీని చూడకుండా మినహాయించేందుకు అనుమతిస్తుంది.
పబ్లిక్ స్టోరీలు
మీ బహిరంగ నా స్టోరీ అనేది మీరు మిమ్మల్ని అనుసరించేవారికి మరియు విస్తృతమైన Snapchat కమ్యూనిటీతో కంటెంట్‌ను ఎలా షేర్ చేసుకొంటారు అన్నదాన్ని సూచిస్తుంది. పబ్లిక్ స్టోరీలు, మీ నిజమైన ఫ్రెండ్స్ మరియు మిమ్మల్ని అనుసరించేవారికి నేరుగా వెళుతుంది. మీ ఫ్రెండ్స్ (మీరు తిరిగి చేర్చిన వారు), మీ పబ్లిక్ స్టోరీస్‌ను, స్టోరీస్ పేజీలోని ఫ్రెండ్స్ విభాగంలో చూస్తారు మరియు మిమ్మల్ని అనుసరించేవారు (మిమ్మల్ని చేర్చినవారు, కాని మీరు చేర్చనివారు), మీ పబ్లిక్ స్టోరీస్‌ను స్టోరీస్ పేజీ యొక్క ఫాలోయింగ్ విభాగంలో చూస్తారు. ఒకవేళ మీకు విస్తృత స్థాయిలో ఆడియన్స్ ఉంటే, మీ పబ్లిక్ స్టోరీస్, స్టోరీస్‌ పేజీపై పంపిణీ చేయబడేందుకు అర్హమవవచ్చు. పబ్లిక్ స్టోరీస్‌ను, పబ్లిక్ ప్రొఫైల్ సందర్శించే ఏ Snapచాటర్ అయినా వీక్షించవచ్చు.
స్పాట్‌లైట్
మీ Snapలను, మీ ఫ్రెండ్స్ మరియు అనుసరించేవారుకాక ఇతర ఆడియన్స్‌తో షేర్ చేయడానికి, స్పాట్‌లైట్‌కు సబ్మిట్ చేయండి. స్పాట్‌లైట్‌పై మీ కంటెంట్ షేర్ చేసుకోవడమంటే, కొత్త అభిమానులచే కనుగొనబడటానికి మరియు మీ ఆడియన్స్ పెంచుకోవడానికి ఒక అవకాశం! మీరు మీకిష్టమైన స్పాట్‌లైట్లను, "పబ్లిక్ ప్రొఫైల్‌పై Snap చూపించండి" ని టాగుల్ చేయడంద్వారా, మీ పబ్లిక్ ప్రొఫైల్‌కు నేరుగా సేవ్ చేసుకోవచ్చు.
Snap మ్యాప్
Snap మ్యాప్ మీ వ్యక్తిగత మ్యాప్, దీనిపై మీరు మీ ప్రదేశంనుండి Snapలను అందరితో షేర్ చేసుకోవడంతోపాటు, ప్రపంచవ్యాప్తంగా సృష్టించబడిన కంటెంట్ వీక్షించవచ్చు.
మీరు ఒక పబ్లిక్ ప్రొఫైల్ కలిగి ఉన్నట్లయితే, Snap మ్యాప్‌కు అనామకంగా లేదా మీ పేరు చేర్చి Snapలను సబ్మిట్ చేయవచ్చు. ఒకవేళ మీరు Snap మ్యాప్‌కు మీ పేరుతో ఒక Snap షేర్ చేసినట్లయితే, మీ Snap చూసిన వారు మిమ్మల్ని అనుసరించవచ్చు మరియు మీ Snapనుండి మీ పబ్లిక్ ప్రొఫైల్ సందర్శించడంద్వారా మీ కంటెంట్ కనుగొనగలుతారు.
స్పాట్‌లైట్ లేదా మీ పబ్లిక్ స్టోరీలకు షేర్ చేయబడిన ప్లేస్ ట్యాగ్‌లతో ఉన్న Snapలు, Snap మ్యాప్‌పై ప్లేస్ ప్రొఫైల్స్‌లో కనిపిస్తాయి.
స్టోరీస్ ను మీ పబ్లిక్ ప్రొఫైల్‌కు సేవ్ చేసుకోండి
నా పబ్లిక్ ప్రొఫైల్ → ‘స్టోరీస్’ కి వెళ్ళండి.
ప్రొఫైల్ మేనేజ్‌మెంట్ విభాగం నుండి మీ ప్రొఫైల్ ట్యాప్ చేసి, స్టోరీస్ ట్యాబ్‌కు వెళ్లి, ’మీ ప్రొఫైల్‌కు ఒక స్టోరీ జోడించండి’ పై ట్యాప్ చేయండి.
మీ స్టోరీని సృష్టించండి
మీ స్టోరీని సృష్టించేందుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ Snapలను ఎంచుకోండి. పబ్లిక్ Snapలను మీరు ఇంతకుముందు షేర్ చేసుకొన్న వాటినుండి, మీ మెమోరీస్ నుండి లేదా మీ కెమెరా రోల్‌నుండి మీ ఫోటోలు మరియు వీడియోలను నేరుగా ఎంచుకోవచ్చు. చేయడంపూర్తయిన తరువాత, ’యాడ్’పై ట్యాప్ చేయండి. ఒక స్టోరీలో 100 వరకు Snapలు లేదా 5 నిమిషాల కంటెంట్‌ని - మీరు దేనిని ముందుగా చేరుకొంటే అంతవరకు కలిగి ఉండవచ్చు.
మీ స్టోరీని సమీక్షించండి మరియు ఎడిట్ చేయండి.
స్టోరీ మొత్తాన్ని ముందుగా సమీక్షించేందుకు ఒక Snap, ఫోటో లేదా వీడియోను టాప్ చేసి అది మీ ఆడియన్స్ కు ఎలా కనిపిస్తుందో చూడవచ్చు. కుడి పైమూలలోని 'ఎడిట్'ను టాప్ చేయడంద్వారా కంటెంట్‍ను తిరిగి సర్దుబాటు చేయవచ్చు లేదా తొలగించవచ్చు.
మీ టైటిల్ మరియు కవర్ ఫోటోను ఎంచుకోండి.
మీ స్టోరీకి ఒక శీర్షికను ఎంచుకోండి. కవర ఫోటోను ఎంచుకోవడానికి ఫోటో పిక్కర్‍ను స్క్రోల్ చేయండి మరియు సేవ్ చేయబడిన మీ స్టోరీలోని కంటెంట్ నుండి ఒక చిత్రాన్ని ఎంచుకోండి, ఒక మంచి శీర్షిక మరియు కవర్ ఫోటో, స్టోర్‍లో ఇంకా ఏమున్నాయని మీ అభిమానులకు ఒక సూచననిస్తుంది! మీ పని పూర్తయిన తరువాత, మీ స్టోరీని మీ పబ్లిక్ ప్రొఫైల్‍కు పబ్లిష్ చేసేందుకు ’ఫినిష్' పై టాప్ చేయండి.