Snapchat బేసిక్స్
Snapchat అంటే ఏమిటి?
Snapchat అనేది నిజమైన స్నేహితుల కోసం తయారు చేయబడిన ఒక కెమెరా యాప్. ఇది అభివృద్ధి పరచబడిన వాస్తవికత ద్వారా మిమ్మల్ని మీరు వ్యక్తీకరించేందుకు, మీ స్నేహితులు మరియు కుటుంబంతో వినోదం పంచుకొనేందుకు మరియు మీ సృజనాత్మకతను ప్రపంచంతో పంచుకొనేందుకు వీలు కల్పించే ఒక వేదిక.
  • Snapchat ప్రపంచవ్యాప్తంగా 293 మిలియన్లకు పైగా రోజూ ఉపయోగించే చురుకైన యూజర్లను కలిగివుంది - Snapchat యు.ఎస్., యు.కె., ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ది నెదర్లాండ్స్ లలోని 13-24 వయస్సు వారిలో 90%, 13-34 వయస్సు వారిలో 75% వరకు ప్రజలకు చేరువవుతోంది.
  • ప్రతిరోజూ సగటున దాదాపు 200 మిలియన్లకు పైగా స్నాప్‍చాటర్లు అభివృద్ధి పరచబడిన వాస్తవికతతో మిళితమై ఉంటున్నారు.
  • మీ వీడియోలు మరియు చిత్రాలకు AR లెన్సెస్, ఫిల్టర్లు, మరియు ఇతర క్రియేటివ్ టూల్స్ చేర్చడంద్వారా మీ కంటెట్ంట్‍ను ప్రస్ఫుటంగా కనపడేలా చేసుకోండి
  • మా వెబ్‍సైట్ ఒక Snapchat సృష్టికర్తగా మీ కెరీర్‍ను నిర్మించుకొనేందుకు స్ఫూర్తి, చిట్కాలు మరియు సూచనలు్, మరియు ఎలా చేయాలి అనే వాటిని అందిస్తుంది
Body Image
ఒక అక్కౌంట్ సృష్టించడం
ఒక ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్ అడ్రస్ ఉపయోగించి Snapchat యాప్ డౌన్‍లోడ్ చేసుకోండి మరియు తెరవండి. కొన్ని తక్షణ ప్రాంప్ట్ లను అనుసరిస్తే, మీ అన్నింటికీ సిద్ధంగా ఉన్నట్లే.
ప్రొ చిట్కా: Snapchatters మిమ్మల్ని సులభంగా కనుగొనేందుకు ఒక యూజర్ నేమ్‍ను ఎంచుకోండి. మీ పేరును ఎంటర్ చేయడానికి ముందు, సులభంగా గుర్తించడానికి వీలుగా ఒక డిస్‍ప్లే పేరును ఎంచుకొన్నారని నిర్ధారించుకోండి.
అకౌంట్ భద్రత
మా Snapchat కమ్యూనిటీ భద్రతకంటే ఏదీ మాకు ముఖ్యం కాదు. మా లక్షణాలు డిఫాల్ట్ గా గోప్యంగా ఉంచబడతాయి. Snapchatterలు తాము షేర్ చేసుకోదలచిన సమాచారాన్ని మరియు ఎవరితో పంచుకోవాలనేదాన్ని ఎంచుకోవచ్చు.
అదనపు భద్రతా ఫీచర్లు సెట్టింగ్ చేయడంద్వారా అనధీకృత యాక్సెస్‍ను నివారించండి. ఇది రెండు-అంచెల ప్రామాణీకరణ. 'సెట్టింగ్‍ల' క్రింద మీ ప్రొఫైల్‍లో రెండు-అంచెల ప్రామాణీకరణను ఎనేబుల్ చేయండి.