ఆశావహ & నిపుణులైన సృష్టికర్తలకు

CH_016
Snap స్టార్స్

Snap స్టార్స్ అనేవారు Snapchat చే వెరిఫై చేయబడి మరియు యాప్-లో గోల్డ్ వెరిఫికేషన్ స్టార్ అందుకొన్న టాప్ సృష్టికర్తలు మరియు ప్రజా ప్రముఖులు. వారు సాంస్కృతికంగా సంబంధిత వ్యక్తులు మరియు Snapchat పై అధికంగా నిమగ్నమైన వారు, మరియు భారీ వీక్షకుల్ని పెంచుకొని, ఉన్నత-నాణ్యత గల కంటెంటును కలిగి ఉన్నారు. Snap స్టార్స్ ప్రత్యేకమైన ఫీచర్లు మరియు మానిటైజేషన్ అవకాశాలకు ప్రాప్యత కలిగి ఉన్నారు, మరియు Snapchat చేత ఆ విధంగా ఎంపిక చేయబడి ఉన్నారు. మీరు మీ కంటెంటును పెంచుకుంటూ పోతూ మరియు మీ వీక్షకుల్ని పెంచుకునే కొద్దీ, మీరు ఒక Snap స్టార్ గా మారేందుకు ఆహ్వానించబడవచ్చు.  మీరు Snap స్టార్ స్థితికి అర్హులని గనక మీరు విశ్వసిస్తే, దయచేసి ఈ ఫారము ను పూర్తి చేయండి మరియు మీరు గనక ఆమోదించబడితే, ప్రోగ్రాముకు మీరు ఆహ్వానించబడవచ్చు.

మరింత సమాచారం కోసం, ఇక్కడతెలుసుకోండి.

పాత్రలను నిర్వహించండి

మీ పబ్లిక్ ప్రొఫైల్‍ని నిర్వహించడంలో మీకు సహాయ పడేందుకు మీకు ఇష్టం వచ్చినంత మంది నమ్మదగిన Snapchatterలకు ఆయా పాత్రలను కేటాయించవచ్చు. మీరు ఒక పాత్రకు ఎవరినైనా కేటాయించినప్పుడు, వారు నోటిఫికేషన్ పొందుతారు. మీరు సరైన యూజర్‍నేమ్ జోడించారని నిర్ధారించుకోండి!

ఒక పాత్రను కేటాయించడానికి, మీ ప్రొఫైల్ స్క్రీన్‍లో కుడిపై మూల ఉండే సెట్టింగుల గేర్ ఐకాన్‍ను టాప్ చేయండి. ఆతరువాత 'మేనేజ్ రోల్స్'>'అసైన్ న్యూ రోల్'>'యూజర్ నేమ్ ఎంటర్ చేయండి'>'సంబంధిత పాత్రను ఎంచుకోండి’.

ప్రొఫైల్ అడ్మిన్‍లు మీ పబ్లిక్ ప్రొఫైల్‍ను నిర్వహించవచ్చు, మీ పబ్లిక్ స్టోరీ నుండి ఏవైనా Snapలను జోడించవచ్చు లేదా తొలగించవచ్చు, హైలైట్స్ నిర్వహించవచ్చు, పాత్రలు కేటాయించవచ్చు, మరియు ఇన్‍సైట్స్ వీక్షించవచ్చు.

ప్రొఫైల్ కొలాబొరేటర్లు మీ ఇన్‍సైట్లను వీక్షించవచ్చు మరియు మీ పబ్లిక్ స్టోరీకి ఏవైనా Snapలను జోడించవచ్చు లేదా తొలగించవచ్చు,

స్టోరీ కాంట్రిబ్యూటర్లుమీ పబ్లిక్ స్టోరీకి Snapలను జోడించవచ్చు మరియు తొలగించవచ్చు లేదా ఈ Snapలపై ఇన్‍సైట్లను వీక్షించవచ్చు మరియు గతంలోని మీ అన్ని Snapలను వీక్షించబచ్చు.

ఇన్‍సైట్ వీక్షకులు-మీరు అనుకొంటున్నట్లే-మీ ఇన్‍సైట్లను వీక్షించగలరు.

మీ వీక్షకుల్ని పెంచుకోవడానికి చిట్కాలు

మీ వీక్షకుల్ని పెంచుకోవడానికి మరియు నిమగ్నం కావడానికై స్పాట్‌లైట్, మీ పబ్లిక్ స్టోరీ, మరియు Snap మ్యాప్ కి పబ్లిక్‌గా పోస్ట్ చేయండి.

  • స్పాట్‌లైట్, Snap మ్యాప్, మరియు మీ పబ్లిక్ స్టోరీకి మీ Snapsని షేర్ చేయండి

  • ఒక వారములో కొన్ని సార్లు మిమ్మల్ని జోడించడానికై, అనుసరించని వారిని ప్రోత్సహించండి

  • మీ పబ్లిక్ స్టోరీ పోస్టుల కొరకు స్టోరీ నోటిఫికేషన్లను ఆన్ చేయడానికి అనుచరులను ప్రోత్సహించండి

  • స్టోరీ ప్రత్యుత్తరాలు మరియు కోటింగ్ ఉపయోగించి మీ అనుచరులతో నిమగ్నం అవ్వండి