Snapchat అన్వేషించండి
Snapchat మీ రోజువారి జీవనం గురించి క్షణాలను మీకు నిజంగా ఇష్టమైన వారితో షేర్ చేసుకోవడానికి రూపొందించబడింది.
CH_010
5 ట్యాబ్‍లను నావిగేట్ చేయడం
కెమెరా. Snapchat ఎప్పుడూ ఫీడ్‍కు కాకుండా కెమెరాకు నేరుగా తెరుచుకొంటుంది, అందువల్ల మీరు ఆక్షణంలో మీ ఆలోచనను క్యాప్చర్ చేసుకోవచ్చు. ఫోటోలు మరియు వీడియో Snapలు తీసుకొనేందుకు కెమెరా ఉపయోగించండి, లెన్సెస్ మరియు సృజనాత్మక టూల్స్ వర్తింపజేయండి మరియు సన్నిహితులైన మీ ఫ్రెండ్స్ తో లేదా Snapchat కమ్యూనిటీపై షేర్ చేయండి.
చాట్. ఫ్రెండ్స్ మరియు గ్రూప్‍లకు Snaps పంపండి మరియు మీ Bitmoji లేదా కేమియోతో సందేశం పంపడం మరింత వినోదభరితంగా చేయండి. ఎంపిక చేయబడిన ఒక వెరిఫైడ్ సృష్టికర్తల గ్రూప్ కూడా స్టోరీ తిరుగు సమాధానాలివ్వడం అని పిలిచే ఒక ఫీచర్‍కు యాక్సెస్ కలిగివుంటుంది, దీనిలో మీరు అభిమానులతో నేరుగా స్పందించవచ్చు.
మ్యాప్. హాట్‍స్పాట్‍ పై ట్యాప్ చేయడం ద్వారా, స్థానిక కమ్యూనిటీ నుండి ప్రపంచంలో ఏం జరుగుతోందో లేదా మీ ఫ్రెండ్స్ తో ఏం జరుగుతోందో తెలుసుకోండి - ఒకవేళ వారు ప్రదేశాన్ని షేర్ చేస్తే మీరు వారి బిట్‍మోజీలు చూడగలరు.
కథలు. Snap స్టార్స్ కంటెంట్‍తో మీ స్నేహితుల నుండి మరియు ప్రదర్శనలు మరియు Snap ఒరిజినల్స్ నుండి కథలను ఆస్వాదించండి. మీకిష్టమైన వాటితో లేదా వేరే ఒక క్రొత్త దానితో మిమ్మల్ని ఉత్తేజ పరచుకోండి.
స్పాట్‍లైట్. యాప్‍లో ఎడమ మూలలో ఉండే స్పాట్‍లైట్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇక్కడే కమ్యూనిటీ నుండి బాగా వినోదాన్నిచ్చే స్నాప్స్ ప్రదర్శితమవుతాయి మరియు ఇక్కడి నుండే మీరు ఎక్కువమంది ఆడియన్స్ కు చేరువవుతారు. ఏది ట్రెండింగ్ అవుతోందో చూడండి మరియు మీ ఉత్తమమైన వాస్తవ కంటెంట్‍ను షేర్ చేసుకోండి.
మీ ప్రెండ్స్ ను చేర్చండి & మీ ప్రేక్షకులను పెంచుకోండి
మీకు ఇప్పటికే తెలిసిన వారితో (స్నేహితులు, కుటుంబం లేదా అభిమానులు) సంబంధం పెంచుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, మరియు మీ ప్రేక్షకులను పెంచుకోవడానికి మీ ప్రొఫైల్ షేర్ చేసుకోండి.
Snapcode. భిన్నమైన మీ Snapcodeను వీక్షించేందుకు మీ ప్రొఫైల్ ఎడమ పై మూలలో ట్యాప్ చేయండి. మీరు Snapchatపై సులభంగా స్నేహితులను జోడించేందుకు ఈ కోడ్‍ను మీరు అన్ని సామాజిక మాధ్యమాలపై Snapcodeను ట్యాప్ చేయడం లేదా స్క్రీన్ యొక్క కుడి పైభాగాన షేర్ ఐకాన్ ట్యాప్ చేయడంద్వారా షేర్ చేసుకోవచ్చు.
యూజర్ పేరు. మీ అన్ని సామాజిక ఛానళ్ళ బయోలకు మీ యూజర్ పేరును జోడించారని నిర్ధారించుకోండి.
కాంటాక్టులు. మీ మొబైల్‍లో మీ ప్రొఫైల్‍కు వెళ్ళి, 'ఫ్రెండ్స్ చేర్చండి' ని ట్యాప్ చేయడంద్వారా, మీరు మీ మొబైల్ కాంటాక్టుల నుండి ఫ్రెండ్స్ ను జోడించవచ్చు; కాని, మీ కాంటాక్టులకు యాక్సెస్ చేసేందుకు మీరు Snapchatకు అనుమతి ఇవ్వవలసి ఉంటుంది.
సూచించబడిన ఫ్రెండ్స్. మీరు సూచించిన ఫ్రెండ్స్ 'క్విక్ యాడ్' క్రింద 'ఫ్రెండ్స్ ను జోడించండి' స్క్రీన్‍పై కనిపిస్తారు.