మీ పబ్లిక్ ప్రొఫైల్

తమ ఉత్తమ Snaps ప్రజలకు ప్రదర్శించేందుకు ఉపయోగించేందుకు, 18 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న Snapచాటర్లు అందరూ పబ్లిక్ ప్రొఫైల్ కలిగి ఉంటారు. Snapchatపై ఉండే ఒక అకౌంట్ మీరు Snapsను కేవలం ఫ్రెండ్స్‌కు షేర్ చేసుకోవడంతోపాటు, ప్రజలలో మీకు ఒక స్థానాన్ని ఏర్పరచేందుకు మరియు ఒక సృష్టికర్త అయ్యేందుకు అనుమతిస్తుంది. కంటెంట్‌ను బహిరంగంగా షేర్ చేయడం మరియు పబ్లిక్ ప్రొఫైల్ నిర్మించడం ఐఛ్ఛికం.

ఒక పబ్లిక్ ప్రొఫైల్ యొక్క ఫీచర్లు
  • పబ్లిక్ స్టోరీలు. ఈ స్టోరీ అనేది పోస్టింగ్ చేసిన తరువాత 24 గంటలపాటు యాక్టివ్‍గా ఉండి, మీ ఫ్రెండ్స్ మరియు మిమ్మల్ని అనుసరించేవారు మరియు Snapchat కమ్యూనిటీలో ఎవరైనా వీక్షించగలిగేలా ఉంటుంది. మీ పబ్లిక్ స్టోరీ మీరు విస్తృతమైన ఆడియన్స్ నిర్మించుకొనేందుకు మరియు మీ ఫ్రెండ్స్ కొరకు నా స్టోరీ నుండి భిన్నంగా ఉంటుంది.

  • అధునాతన ఇన్ సైట్స్. స్టోరీ, స్పాట్‌లైట్, లెన్స్ మరియు ఆడియన్స్ ఇన్‌సైట్స్ అనేవి మీ Snapల పనితీరును అర్థం చేసుకోవడానికి సహాయపడటంతోపాటు, ఇతర Snapచాటర్లు ఇష్టపడేలా మరింత ఆసక్తికరమైన కంటెంట్ సృష్టించేందుకు దోహదపడుతుంది!

  • పబ్లిక్ స్టోరీ ప్రత్యుత్తరాలు మరియు కోటింగ్. స్టోరీ ప్రత్యుత్తరాలు మరియు కోటింగ్ ద్వారా మీరు పోస్ట్ చేసిన పబ్లిక్ స్టోరీస్‌పై అర్థవంతమైన సంభాషణలను కలిగివుండండి. మీరు స్టోరీ ప్రత్యుత్తరాలను, మిమ్మల్ని అనుసరించేవారు మరియు మీ ఫ్రెండ్స్‌తో మరింతగా నిమగ్నమయ్యేందుకు ఉపయోగించవచ్చు మరియు కోటింగ్ సాధనాన్ని మీకిష్టమైన స్టోరీ ప్రత్యుత్తరాలనుండి కొత్త పబ్లిక్ స్టోరీస్ సృష్టించేందుకు ఉపయోగించవచ్చు. మీరు మీ పబ్లిక్ ప్రొఫైల్ సెట్టింగులలో స్టోరీ ప్రత్యుత్తరాలను ఎప్పుడైనా ఆఫ్ చేసే వీలు కలిగివుంటారు మరియు వారు స్వీకరించే సందేశాల రకాలపై, తద్వారా గౌరవనీయమైన మరియు వినోదభరితమైన సంభాషణలు కలిగివుండేలా, మేము సృష్టికర్తలకు కస్టమ్ చేయబడిన పదాల ఫిల్టర్‌తో నియంత్రణలను ఇస్తాము.

  • స్టోరీస్ మరియు స్పాట్‌లైట్లను మీ ప్రొఫైల్‌కు సేవ్ చేసుకోండి. మీ పబ్లిక్ ప్రొఫైల్‌పై శాశ్వతంగా ఉండేందుకు, మీ అత్యుత్తమ పబ్లిక్ స్టోరీస్, మ్యాప్ Snapలు, మరియు స్పాట్‌లైట్లను ఎంచుకోండి.

  • యాక్టివిటీ ఫీడ్. మీ స్పాట్‌లైట్ సబ్మిషన్ల గురించి అప్‌డేట్‌లు పొందండి, పబ్లిక్ స్టోరీస్‌ మరియు స్పాట్‌లైట్లపై ప్రత్యుత్తరాలు మరియు మరెన్నింటినో మేనేజ్ చేసుకోండి!

మీ పబ్లిక్ ప్రొఫైల్‌ను కస్టమైజ్ చేసుకోండి

మీ పబ్లిక్ ప్రొఫైల్ అనేది పబ్లిక్ ఉనికిని ఏర్పరచేందుకు మరియు కంటెంట్ సృష్టికర్తగా Snapchatపై మీ ప్రయాణాన్ని ఆరంభించేందుకు అనువైన ప్రదేశం. మీ పబ్లిక్ ప్రొఫైల్‌ను కనెక్షన్లు నిర్మించేందుకు, అనుసరించేవారిని పొందేందుకు, మీకిష్టమైన కంటెంట్‌ను ప్రదర్శించేందుకు మరియు మిమ్మల్ని వ్యక్తపరచేందుకు ఉపయోగించుకోండి. మీ పబ్లిక్ ప్రొఫైల్‌ను యాక్సెస్ చేయడానికి, స్క్రీన్ ఎడమవైపు ఉండే మీ Bitmojiపై ట్యాప్ చేసి, "నా పబ్లిక్ ప్రొఫైల్" ఎంచుకోండి.

మీరు ఒక ప్రొఫైల్ ఫోటో, కవర్ ఫోటో జోడించవచ్చు, ఒక బయో సృష్టించవచ్చు మరియు మీ పబ్లిక్ ప్రొఫైల్‌కు మీకిష్టమైన స్టోరీస్ మరియు స్పాట్‌లైట్లను శాశ్వతంగా లేదా మీకు నచ్చినంత కాలం సేవ్ చేసుకోవచ్చు. మీరు నిర్మించిన ఏ లెన్సెస్ అయినా మీ పబ్లిక్ ప్రొఫైల్‌కు చేర్చబడతాయిమరియు మీరు మీ లెన్సెస్‌ను నా లెన్సెస్
ద్వారా నిర్వహించుకోవచ్చు. మీ పబ్లిక్ ప్రొఫైల్ సెట్ చేసుకోవడంలో ఏదైనా సహాయం కావాలా? మరింత సమాచారానికి పబ్లిక్ ప్రొఫైల్ ఎఫ్‍ఎక్యూలను దర్శించండి!

సేవ్ చేయబడిన స్టోరీలను సృష్టించండి

  1. 'సేవ్ చేయబడిన స్టోరీలకు' నావిగేట్ చేయండి. ప్రొఫైల్ మేనేజ్‍మెంట్ విభాగం నుండి, మీ ప్రొఫైల్‍ను టాప్ చేసి, 'సేవ్ చేయబడిన స్టోరీల'కు వెళ్ళండి.

  2. Snapలు, ఫోటోలు, వీడియోలను ఎంచుకోండి. సేవ చేయబడిన స్టోరీలకు క్రొత్త కంటెంట్ జోడించేందుకు ’+' బటన్ని టాప్ చేయండి. మీ కెమెరా రోల్‍ నుండి మీరు ఇంతకుముంది షేర్ చేసుకొన్న పబ్లిక్ Snapలు, లేదా ఫోటోలు మరియు వీడియోలను మీరు ఎంచుకోవచ్చు. మీ పని పూర్తయిన తరువాత, 'ఇంపోర్ట్'ను టాప్ చేయండి. ఒక స్టోరీలో 100 Snaps లేదా 5 నిమిషాల కంటెంట్‌ని కలిగి ఉంటుంది - ఏది ముందు అయితే అది ఉండవచ్చు.

  3. మీ స్టోరీని సమీక్షించండి మరియు ఎడిట్ చేయండి. స్టోరీ మొత్తాన్ని ముందుగా సమీక్షించేందుకు ఒక Snap, ఫోటో లేదా వీడియోను టాప్ చేసి అది మీ ఆడియన్స్ కు ఎలా కనిపిస్తుందో చూడవచ్చు. కుడి పైమూలలోని 'ఎడిట్'ను టాప్ చేయడంద్వారా కంటెంట్‍ను తిరిగి సర్దుబాటు చేయవచ్చు లేదా తొలగించవచ్చు.

  4. మీ టైటిల్ మరియు కవర్ ఫోటోను ఎంచుకోండి. మీ స్టోరీకి ఒక శీర్షికను ఎంచుకోండి. కవర ఫోటోను ఎంచుకోవడానికి ఫోటో పిక్కర్‍ను స్క్రోల్ చేయండి మరియు సేవ్ చేయబడిన మీ స్టోరీలోని కంటెంట్ నుండి ఒక చిత్రాన్ని ఎంచుకోండి, ఒక మంచి శీర్షిక మరియు కవర్ ఫోటో, స్టోర్‍లో ఇంకా ఏమున్నాయని మీ అభిమానులకు ఒక సూచననిస్తుంది! మీ పని పూర్తయిన తరువాత, మీ స్టోరీని మీ పబ్లిక్ ప్రొఫైల్‍కు పబ్లిష్ చేసేందుకు ’ఫినిష్' పై టాప్ చేయండి.