Snap ధ్వనులు & సంగీతం
మీ Snapలను మరింతగా జ్ఞాపకం ఉంచుకొనేలా ధ్వనులు జోడించండి.
ధ్వనుల టూల్
ధ్వనుల టూల్ (కెమెరా స్క్రీన్‍పై 🎵 ఐకాన్) Snapchatterలు లెన్సులు ఉన్న పాటల క్లిప్‍లు, టీవీ మరియు చిత్రాల నుండి భాగాలు, మరియు వాటి స్వంత అసలైన ఆడియోను తమ Snaps మరియు స్టోరీస్‍కు ఎనేబుల్ చేస్తుంది.
ధ్వనులు మిమ్మల్నిమీరు వ్యక్తీకరించుకోవడానికి స్పూర్తిని కనుగొనడం, లేదా మీరు ఇంతకుముందు వినని కొత్త కళాకారులను కనుగొనడానికి ఉపయోగించుకోండి.
ఈ టూల్ Snap యొక్క సంగీత భాగస్వాములు మరియు టీవీ మరియు Snap కంటెంట్ భాగస్వాముల నుండి మూవీ ఆడియోల ప్లేలిస్ట్ కలిగివుంటుంది. ప్లేలిస్ట్ లు ప్రధానంగా జోనర్లు, మానసిక స్థితి, మన కమ్యూనిటీకి సంబంధించిన మరియు Snapchatపై బాహుళ్యంలో ఉన్న పాటలపైకూడా దృష్టిపెడుతుంది. వీటిని పరీక్షించుకోండి మరియు సంగీతం మరియు టీవీ లేదా చిత్ర సంగీతాన్ని మీ Snapలలో ఉపయోగించేటప్పుడు మాధ్వనులకు సంబంధించి Snapchat మార్గదర్శకాలు అనుసరిస్తున్నారని నిర్ధారించుకోండి.
ఎవరైనా మీ Snapను ధ్వనులతో చూసినట్లయితే, వారు పాట టైటిల్, కళాకారుని పేరు, ఆల్బమ్ ఆర్ట్ ను వీక్షించేందుకు స్వైప్ చేసుకోవడమేగాక, వారు దానిని తమ Snapలో కూడా ఉపయోగించుకోవచ్చు. వారు ’ప్లే దిస్ సాంగ్'పై టాప్ చేసి, పూర్తి వెర్షన్‍ను స్ట్రీమింగ్ ప్లాట్‍ఫారంలపై వినవచ్చుకూడా.
మీ Snapలను సంగీతాన్ని జోడించండి
Snapchatterలు, ఎన్నో ప్రముఖ రికార్డ్ లేబుల్స్ మరియు పబ్లిషర్లతో మేము కలిగివున్న భాగస్వామ్యాలవల్ల లభించే రాబోయే మరియు ప్రముఖ కళాకారుల సంగీత విశిష్ట కేటలాగ్ నుండి తమ Snapలకు పాటలను జోడించవచ్చు (క్యాప్చర్ కంటే ముందు లేదా ఆ తరువాత).
మీ Snapకు ఒక ట్రాక్ జోడించేందుకు...
  1. కెమెరా స్క్రీన్ తెరవండి
  2. ధ్వనుల ఐకాన్ 🎵పై టాప్ చేయండి
  3. క్యూరేటెడ్ ప్లేలిస్ట్ ల నుండి ఒక ట్రాక్‍ను ఎంచుకోండి, లేదా ఒక నిర్ధారిత పాటకోసం శోధించండి. ఒక్కసారి చూసుకొనేందుకు ప్లే బటన్ని టాప్ చేయండి.
  4. మీరు పాటను ఎక్కడ ప్రారంభించాలో నిర్ణయించుకోండి
  5. మీకు కావలసిన రీతిలో వచ్చిందని నిర్ధారించుకొనేందుకు తిరిగి ప్లే చేయండి
అసలైన ధ్వనులు
Snapchatపై సృజనాత్మకంగా ఉండటమంటే విభిన్నమైన మీ స్వరాన్ని వెల్లడి చేయడమే, అందువల్ల మీ స్వంతవైన ధ్వనులను కూడా సృష్టించండి!
మీ స్వంత వాస్తవ ధ్వనులు సృష్టించి Snapకు జోడించేందుకై...
  1. కెమెరా స్క్రీన్ తెరవండి
  2. ధ్వనుల ఐకాన్ పై టాప్ చేయండి
  3. 'ధ్వనిని సృష్టించండి' పై టాప్ చేయండి
  4. 60 సెకండ్లవరకు రికార్డ్ చేయడానికి మైక్రోఫోన్ బటన్‍పై టాప్ చేయండి, ఆ తరువాత రికార్డింగ్ ఆపివేసేందుకు మరొకసారి టాప్ చేయండి
  5. మీ అసలైన ధ్వనికి పేరు పెట్టండి
  6. ఈ ధ్ననిని పబ్లిక్ చేయాలా వద్దా అన్నది ఎంచుకోండి మరియు ఆడియోను మీకు కావలసిన పొడవుకు కుదించండి
  7. 'ధ్వనిని సేవ్ చేయండి’ టాప్ చేయండి
Snap ట్రెండింగ్
స్పాట్‍లైట్‍ పై అల్గారిథమిక్‍గా క్యురేట్ చేయబడిన ఈ రోజుకు ఎంతో ప్రముఖమైన ధ్వనులను చూడండి!
మరెన్నో విజయవంతమైన Snapలను సృష్టించేందుకు ఈ ట్యాబ్‍ను ఉపయోగించండి.
Snapchatపై మీ ధ్వనులను పొందండి
సంగీత సృష్టికర్తలు తమ స్వంత పాటలను మా లైబ్రరీకి జోడించేలా మేము ప్రోత్సహిస్తాము. ఇది చేయడానికి ప్రధానంగా రెండు మార్గాలు ఉన్నాయి:
  • సంతకం చేసిన కళాకారులు మీ రికార్డ్ లేబుల్‍తో పనిచేస్తారు
  • స్వతంత్ర కళాకార్రులు, ఒరిజినల్ సంగీతాన్ని సృష్టించడానికి మ్ వాయిసీ యాప్ లేదా Snap భాగస్వామిడిస్ట్రోకిడ్ ను ఉపయోగించి సంగీతాన్ని పంపిణీ చేయవచ్చు.
మీ స్టోరీకి లేదా స్పాట్‍లైట్‍కు నడుస్తున్న #టాపిక్స్ ఉపయోగించి, మీ Snapsలో ఆడియోని ప్రచారం చేసుకోవడానికి నిరంతరం Snaps పోస్ట్ చేయండి.