ఎడిటింగ్ టూల్స్
చారిత్రాత్మక Snaps తయారు చేసేందుకు మరిన్ని మార్గాలను అన్వేషించండి.
పోస్ట్-క్యాప్చర్ ఫిల్టర్లు
మీరు ఒకసారి మీ Snapను క్యాప్చర్ చేసిన తరువాత, కూల్ ఫ్రేమ్ లెన్సులు మరియు కొత్త రంగులు మరియు ఆకృతులను అద్దే ఫిల్టర్లను కనుగొనేందుకు కుడికి స్వైప్ చేయండి. మీరు మీ కెమెరా రోల్ నుండి అప్‍లోడ్ చేసే ఫోటోలు/వీడియోలకు కూడా ఈ ఎఫెక్ట్స్ జోడించవచ్చని మర్చిపోకండి.
క్యాప్షన్లు తో బ్యాక్‍గ్రౌండ్స్
మీ క్యాప్షన్లకు వివిధ రకాలైన బ్యాక్‍గ్రౌండ్స్ తో మసాలా జోడించండి!
ప్రొ చిట్కా: బ్యాక్‍గ్రౌండ్స్ తో క్యాప్షన్లను జోడించేటప్పుడు బాగా విరుద్ధంగా కనిపించే రంగులను ఉపయోగించండి.
# అంశాలు
ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించడానికి మరియు Snapchatterలు ఇటువంటి Snaps కనుగొనడంలో సహాయపడేందుకు, స్పాట్‍లైట్‍లో బాగా ప్రాచుర్యంలో ఉన్న #అంశాన్ని ఎంచుకోండి.
ఆటో క్యాప్షన్లు
మీ ఆడియన్స్ ఆటో క్యాప్షన్లు లేకుండా ఒక్క పదాన్ని కూడా కోల్పోరని నిర్ధారించుకోండి. ఆన్ చేసినప్పుడు, వీక్షకులు మీ స్నాప్‍లను ధ్వనితో లేదా ధ్వని లేకుండా చూడగలిగేలా మీ పదాలను ఆటోమేటిక్‍గా ట్రాన్స్ స్క్రైబ్ చేస్తుంది. ఫాంట్ స్టైల్ మరియు మీ Snapలలో ఎక్కడ ఉండాలనేదానిని కూడా మీరు సర్దుబాటు చేయవచ్చు.
ప్రొ సూచన: ఆడియో ఆప్షనల్ వీడియోలు సాధారణంగా సగటున అధిక ప్లేబ్యాక్ సమయం తీసుకొంటాయి.
సమయ-ఆధారిత క్యాప్షన్లు
టైమింగ్ అనేదే అన్నీ. మీ Snapలో క్యాష్షన్ల వ్యవధిని సర్దుబాటు చేసేందుకు, టెక్స్ట్ జోడించేందుకు స్క్రీన్‍ను టాప్ చేయండి, మీ ఫాంట్‍ను ఎంచుకోండి, ఆతరువాత స్క్రీన్ పైభాగంలో ఉన్న స్టాప్‍వాచ్ ఐకాన్‍ని టాప్ చేయండి.
డూడుల్
డూడ్లింగ్ అనేది మీ Snaps కు మరింత వ్యక్తిత్వాన్ని జోడించే ఒక గొప్ప మార్గం. ఎమోజీలు, టెక్స్ట్, ఉపయోగించండి లేదా స్క్రీన్‍పై మీ వేళ్ళతో అడ్డంగా వ్రాయండి. మీ స్నాప్‍స్టర్‍పీస్ సృష్టించేందుకు కలర్ పిక్కర్ (3 ఓవర్‍లాపింగ్ వృత్తాలు) పై టాప్ చేయండి.