కెమెరా టూల్స్

ఫోటోలు మరియు వీడియోలను మీరు క్యాప్చర్ చేసేవిధానాన్ని మార్చేందుకు ఈ టూల్స్ ఉపయోగించండి.

లెన్సెస్‍ను కనుగొనడం

సృష్టికర్తలు ఉపయోగించడానికి వీలుగా మా దగ్గర అతిపెద్ద లెన్సెస్ లైబ్రరీ ఉంది. మీరు యాప్ తెరచిన వెంటనే కెమెరా స్క్రీన్ నుండి లెన్సెస్‍ను అన్వేషించండి. మీకిష్టమైన లెన్సెస్‍ను చూసేందుకు మరియు ఏది ప్రజల్లో ఎక్కువగా ఉందో చూసేందుకు, క్యాప్చర్ బటన్‍కు కుడివైపు ఉండే స్మైలీ ముఖం ఐకాన్‍పై మెల్లగా టాప్ చేయండి.

సిఫారసు చేయబడిన, ప్రాబల్యంలో ఉన్న మరియు Snapchat చే మరియు కమ్యూనిటీచే సృష్టించబడిన థీమ్ లెన్సెస్‍ను వీక్షించేందుకు 'అన్వేషించండి' పై కుడి మూలలో టాప్ చేయండి.

మీకు మీరే ఒక లెన్స్ ఎలా సృష్టించాలో తెలుసుకోవాలనుకొంటున్నారా? Lens Studio సందర్శించండి.

చేతులతో పట్టుకోకుండా రికార్డింగ్

చూడమ్మా, చేతులు వాడలేదు! ఒక్కొక్కటి పది సెకండ్లపాటు ఉండేలా మొత్తం 60 సెకండ్లు ఉండే ఆరు వీడియోల వరకు రికార్డ్ చేయండి.

మీ వీడియో రికార్డింగ్ ప్రారంభించడానికి స్క్రీన్ యొక్క క్రింది భాగంలోని క్యాప్చర్ బటన్ని నొక్కి ఉంచండి. ఈ బటన్ ప్రక్కన ఒక లాక్ ఐకాన్ కనిపిస్తుంది. చేతులు వాడకుండా చేసేందుకు, ఎడమవైపుకు స్లైడ్ చేసి లాక్ చేయండి. ఇక మీరు చేయదలచుకున్నది చేయండి!

అంతేగాక, ఇది సెల్ఫీ మోడ్‍లో కూడా పనిచేస్తుంది.

కెమెరా టూల్‍కిట్

మీ Snapsను ఆకర్షణీయంగా మార్చుకొనేందుకు కెమెరా స్క్రీన్‍పై కుడివైపు పైన ఉన్న టూల్స్ ఉపయోగించండి.

టైమ్‍లైన్. వివిధ మధుర క్షణాలను ఒకే వీడియోలో బంధించండి.

ధ్వనులు. ఒక ప్లే లిస్ట్ నుండి ఎంచుకోండి లేదా లైసెన్స్ ఉన్న సంగీత లైబ్రరీ నుండి సిఫారసు చేసిన పాటను ఎంచుకోండి లేదా మీ స్వంతదాన్ని సృష్టించుకోండి.

మల్టీ Snap. మీ రికార్డింగ్ యొక్క పొడవును సెట్ చేసుకోండి. క్యాప్చర్ బటన్ని వత్తడం మరియు ఎడమవైపుకు జార్చి లాక్ చేయడంద్వారా చేతుల అవసరం లేకుండా ఉపయోగించండి.

టైమర్. మీరు ఒక పోజ్ ఇచ్చేందుకు కౌంట్‍డౌన్ ప్రారంభించండి.

ఫోకస్. డెప్త్-ఆఫ్-ఫీల్డ్ ప్రభావంతో ముఖంపై ఫోకస్ వేసుకోండి.

3D. మీ సెల్పీకి 3D మెరుగులను జోడించండి. కోణాన్ని మార్చేందుకు మీ ఫోన్‍ను కదిలించండి.

గ్రిడ్. ఫోకస్, snap చేసి, పంపించేందుకు మీ షాట్లను ఒకదాని తరువాత మరొకటి సిద్ధంగా ఉంచండి.

టైమ్‍లైన్ క్యాప్చర్

ఇది కెమెరా టూల్‍కిట్‍లోని ఒక ప్రముఖమైన ఫీచర్లలో ఒకటి. ఎన్నో క్లిప్‍లను రికార్డ్ చేయండి, వాటిని ట్రిమ్ చేసి కలపండి, మీ వీడియోకు టైమ్డ్ క్యాప్షన్లు జోడించండి. మీరు ధ్వనులను కూడా జోడించవచ్చు.