కంటెంట్ మార్గదర్శకాలు

మనకు ఎందుకు కంటెంట్ మార్గదర్శకాలు ఉన్నాయి

Snapచాటర్‌లు వారి స్నేహితులతో మాట్లాడటానికి, వినోదం పొందడానికి మరియు ప్రపంచం గురించి తెలుసుకోవడానికి మా యాప్‌కి వస్తారు. వాస్తవానికి, Snapchat 37.5 కోట్ల కంటే ఎక్కువ రోజువారీ క్రియాశీల వినియోగదారులను కలిగి ఉంది మరియు 20 దేశాలలో 13-24 సంవత్సరాల వయస్సు గలవారిలో 90% మరియు 13 నుండి 34 సంవత్సరాల వయస్సు గలవారిలో 75% కి చేరుకుంటుంది.

చాలా మంది యువకులే.

Snap లో, మా కమ్యూనిటీ కోసం సాధ్యమైనంత ఉత్తమమైన అనుభవాన్ని సృష్టించడం మా లక్ష్యం. మేము వారికి వినోదభరితమైన, సందేశాత్మకమైన మరియు విభిన్నమైన కంటెంట్‌ను అందించాలనుకుంటున్నాము మరియు వారిని ప్లాట్‌ఫారమ్‌లో సురక్షితంగా మరియు భద్రంగా ఉంచడం మా బాధ్యత. ఇక్కడే కంటెంట్ మార్గదర్శకాలు అమలులోకి వస్తాయి.

మా లక్ష్యం చాలా సరళమైనది: మేము Snapchat లో సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన అనుభవాన్ని అందించాలనుకుంటున్నాము - ముఖ్యంగా మా యువ వినియోగదారుల కోసం. దీన్ని చేయడానికి మాకు మీ సహాయం కావాలి.

ఇది మీకు ఎంత విలువైనది

Snapchat యొక్క మా విషన్ ని సాధించడంలో మరియు అవాంఛిత లేదా అనుచితమైన కంటెంట్ నుండి Snapచాటర్‌లను రక్షించడంలో మాకు సహాయపడటానికి మేము మా మార్గదర్శకాలను రూపొందించాము. ప్లాట్‌ఫారమ్ కోసం మీరు ఏ రకమైన కంటెంట్‌ని సృష్టించినా, మేము ప్రతి ఒక్కరికీ న్యాయమైన మరియు స్థిరమైన విధానాలను అమలు చేయాలనీ అనుకుంటున్నాము.

మీ భాగస్వామ్యాన్ని మేము గౌరవిస్తాము. మీరు మా మార్గదర్శకాలకు కట్టుబడి ఉన్నప్పుడు, మీ కంటెంట్‌లో ఎక్కువ భాగం డబ్బు ఆర్జించడానికి మరియు మా ఆడియన్స్ కు చూపడానికి అర్హత పొందుతుంది. అందరూ గెలుస్తారు.

సాధారణ ఉల్లంఘనలు మరియు వాటిని ఎలా నివారించాలి